ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు. బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్ఠ లతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిష్ఠలతోకూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది. ఉపనయనానికి ముందు ఒక జన్మ తరువాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు.
క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా, అధిక ప్రాముఖ్యతతో నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు. మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు. అక్కడవారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు.
ఉపనయనము అయ్యేవరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చటానికి అర్హుడుకాడు. యజ్ఞయాగాది క్రతువులు నెరవేర్చటానికి ఉపనయనము చేసుకున్న తరువాతే అర్హత వస్తుంది. క్షత్రియులకు ధర్మశాస్త్రాలభ్యసించడం అత్యవసరం కనుక ఉపనయన క్రతువు జరిపించి, విద్యాభ్యాసం ఆరంభించేవారు. పితరులకు కర్మకాండ, తర్పణం లాంటి కార్యాలు చేయడానికి ఉపనయనం అత్యవసరం. కొన్ని సందర్భాలాలో తల్లి తండ్రులు మరణావస్థలో ఉన్న సమయాలలో అత్యవసరంగా ఉపనయనం జరిపించి, కర్మకాండ జరిపించే అర్హతనిస్తారు. సన్యసించడానికి ఉపనయనం ప్రధానమే. కనుక హిందూ ధర్మంలో ఉపనయనం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక ప్రక్రియ. హిందూ ధర్మంలో ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు తప్పక నిర్వహించవలసిన బాధ్యత.
ఉపనయనము హిందువులలో కొన్ని కులాలలో మాత్రమే జరిగే ప్రక్రియ. ఇది సాధారణంగా బ్రాహ్మణులకు, వైశ్యులకు మరియు క్షత్రియులకు జరుగుతుంది. ఉపనయనం జరిగిన రోజున బాలుని తండ్రి బాలునికి చెవిలో గాయత్రీ మంత్రం ఉపదేశిస్తాడు. ఉపనయనం జరిగిన నాటి నుండి వటువు ప్రతి నిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. వేదాభ్యాసానికి ముందు తప్పనిసరిగా ఉపనయనం చేయవలెను. వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని స్నాతక ప్రక్రియ ద్వారా వదిలి, గృహస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తాడు వరుడు.
శ్లోకముఉపనయమనం విద్యార్థస్యశ్రుతిత్ స్సగ్గ్ స్కారః అప. ధర్మసూత్రం.
అనగా వేదాధ్యాయనౌ కొరకు శ్రుతి మంత్రములచేత చేయబడు సంస్కారమే ఉపనయనము. అనబడును.
శ్లోఅగ్ని కార్య త్పరిభ్రష్టాః తే సార్వే వృషలాస్మృతాః.||. పరాశర స్మృతి వేదాద్యయనము చేయై బ్రాహ్మణునకు 'వృష్లుడు.' అని పేరు. వృషలుడు అనగా శూద్రుడు లేక పాపాత్ముడు అని అర్థము. కనుక బ్రాహ్మణ బ్రాహ్మచారులకు వేదాధ్యయనము నిత్యమైనది.,. అవశ్యకమైనదీ కూడాను.
"ఉపనయనము అంటే కేవలము మూడు వరుసల జంధ్యము వేసుకోవటం కాదు. దాని అర్థం మనకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి. ఆ మూడవ నేత్రం జ్ఞాననేత్రం. ఆ నేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి. ఉపనయనం అంటే మరొక నయనం(కన్ను,నేత్రం) అని అర్థం. ఆ మూడవ నేత్రం(జ్ఞాననేత్రం) తెరచి ఉంచాలి, అందుకొరకు ప్రాణాయామము నేర్పబడుతుంది. బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు. మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి, ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుంది. ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ, గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ, మూడవ నేత్రంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవలెను. ఇదియే ఉపనయనము యొక్క ప్రాముఖ్యత. అది మరచి ఇప్పటి కాలంలో ప్రాణాయామం అంటే ముక్కుని వేలితో మూస్తూ ఏదో శ్వాస నియంత్రణ చేస్తున్నట్టు నటిచడం, బ్రహ్మోపదేశం అంటే ఒక ముసుగుతో తండ్రి, పిల్లవాడిని కప్పి ఉంచటం, ఆ పిల్లవాడి చెవిలో తండ్రి ఏదో గుసగుసలాడడం వలె మారిపోయింది. భిక్ష అంటే అందరూ ఆ పిల్లవాడి భిక్ష పాత్రను డబ్బులతో నింపడంగా మారిపోయింది. బ్రహ్మోపదేశం ఇచ్చు తండ్రికి, ఈ కార్యక్రమము నడిపించు పురోహితునకు ఉపనయనము యొక్క ప్రాముఖ్యత తెలియనప్పుడు, వారు పిల్లవాడికి ఏమి బోధిస్తారు?"
"అంతే కాదు అలా గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తర్వాత గురువుగారు వారి మనస్సు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో, లేక సన్యాసం వైపు ఆకర్షితమవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపేవారు. కొంత కాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలదేరేవాళ్ళు. కొంత కాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆ పిల్లలను కాశీకి వెళ్ళకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు. సన్యాసం తీసుకోవాలని ధృఢ సంకల్పం ఉన్న వారు, అవి పట్టించుకోక ముందుకు సాగేవారు,మరికొంత మంది పెళ్ళిచేసుకుని ఇంటికి వచ్చేవారు. ఇది అంతా మరచి, కాశీ యాత్ర అంతే ఇప్పుడు, పిల్లవాడు పట్టుబట్టలు కట్టుకుని, కంటికి కాటుక పెట్టుకుని, కాళ్ళకు పారాణి పెట్టుకుని, మెడలో ఒక పూలమాల ధరించి, చేతిలో గొడుగు, కళ్ళకు చెక్క పాదుకలు ధరించి నడుస్తున్నట్టు నటిస్తాడు. పెండ్లికుమార్తె అన్న వచ్చి తన చెల్లెలిని పెళ్లి చేసుకోమని కోరగా, అప్పుడు నాకు వాచీ కావాలి, బండి కావాలి అని పెడ్లికొడుకు అలక పాన్పు ఎక్కుతాడు. ఇక అన్ని ఒప్పుకున్న తర్వాత ఫోటోలు తీసుకోవటం, ఒకరికొకరు బట్టలు పెట్టుకోవటం అలా కార్యక్రమం సాగుతుంది. ఇప్పటి కాలంలో భిక్ష అంటే డబ్బులతో భిక్షపాత్ర నింపటం, కాశీయాత్ర అంటే కట్నం, లాంఛనాలు తీసుకోవటానికి ఉపయోగపడేదిగా మారిపోయింది."
కుమారునికి తండ్రి ఉపనయనం చేస్తాడు. తండ్రి దేశాంతరమందుంటే తాత (తండ్రి యొక్క తండ్రి), అతను లేకుంటే తండ్రి సోదరులు వారుకూడా లేకపోతే వటుడి అన్న దానికి అధికారి అవుతాడు. ఒకవేళ అతను కూడా లేకపోతే సగోత్రమునందు పుట్టినవారు చేయాల్సిఉంటుంది. ఏ వయసులో చెయ్యాలి? బ్రాహ్మణ కులంలో 8వ సంవత్సరాన, క్షత్రియులకు 11వ ఏడున, వైశ్యులకు 12వ ఏడున ఉపనయనం చేయాలి. బ్రాహ్మణులకు చైత్ర మరియు వైశాఖ మాసాలు, క్షత్రియులకు జ్యేష్ట, ఆషాఢ మాసాలూ, వైశ్యులకు ఆశ్వయుజ కార్తీక మాసాలు మంచిది. అందరికీ పనికివచ్చే మాసాలు మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలు. బ్రహ్మచారులలో బ్రాహ్మణులు జింక తోలుని, క్షత్రియులు కురుమృగ చర్మమును, వైశ్యులు గొర్రె తోలును, ఉత్తరీయంగా ధరించాలి. బ్రాహ్మణుడు నార బట్టలు, క్షత్రియుడు వెల్వెట్టు బట్టలు, వైశ్యుడు ఉన్ని బట్టలు ధరించాలి. బ్రాహ్మణుడైన బ్రహ్మచారి ముంజకసువుతో పేనిన సమానమైన మూడు పేటలుగల మొలత్రాడు కట్టాలి. క్షత్రియ బ్రహ్మచారి ముర్వ అని కసుపుతో చేయబడిన మొలత్రాడు కట్టాలి. వైశ్యుడు జనపనారతో చేసిన ముప్పేట గల మొలత్రాడు కట్టాలి. ముంజకసుపు దొరకనప్పుడు దర్భ, రెల్లు, తుంగ నీటితో ముప్పెరిగా చేసిన ఒక ముడి, బూడు ముళ్ళు, ఐదు ముళ్ళుగల మొలత్రాళ్ళను వరసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య బ్రహ్మచారులు ధరించవలెను. బ్రాహ్మణుడు ప్రత్తి నూలుతోను, క్షత్రియులు జనపనారతోను, వైశ్యులు తెల్ల మేక బొచ్చుతోను పేని కుడివైపుగా చుట్టిన తొమ్మిది పోగులుగల యజ్ఞోపవీతమును భుజమునందు ధరించాలి బ్రాహ్మణుడు బిల్వముగానీ, మోదుగగానీ దండముగా ధరించాలి. క్షత్రియ బ్రహ్మచారి మర్రి కొమ్మగానీ, చండ్ర కొమ్మగానీ దండముగ ధరించాలి. వైశ్య బ్రహ్మచారి జివి కొమ్మనుగానీ, మేడికొమ్మనుగానీ దండముగా ధరించాలి. ఆ ముగ్గురు బ్రహ్మచారులు వరసగా కేశము వరకుని, నొసటి వరకును, ముక్కు వరకును ఉండునట్లు దండమును ధరించాలి. ఆ దండములు వంకర లేనివియు, గంట్లు గలిగింపనివియు, పై పట్టతో కూడినవియు, అగ్నిలో కాలనివై ఉండవలెను. వారు దండమును గైకొని సూర్యోపస్థానము చేసి, అగ్నికి ప్రదక్షిణము చేసి యధావిధిగా భిక్షాటనము గావించాలి.
ఉపవీతుడైన బ్రాహ్మణుడు 'భవతీ భిక్షాందేహీ అని భవ శబ్దాన్ని మొదట చెప్పి భిక్షాటన చేయాలి. ఉపవీతుడైన క్షత్రియుడు 'భిక్షాం భవతీ దేహీ అని భవ శబ్దాన్ని మధ్యన చెబుతూ భిక్షాటన చేయాలి. వైశ్య బ్రహ్మచారి 'భిక్షాం దేహి భవతీ అని భవతి శబ్దం చివరనుంచి భిక్షాటన చేయాలి. తల్లినిగాని, తోడబుట్టినదానినిగాని, తల్లితోడవుట్టినదానిని గాని ఎవరు తనను అవమానింపదో అట్టివానిని యాచించాలి. ఈవిధంగా మధూకరము తెచ్చి వలసినంతవరకు గురువునకు మంచి అన్నమును నివేదించి, ఆతని అనుజ్ఞను పొంది యాచమించి తూర్పు ముఖంగా కూర్చుండి పరిశుద్ధుడై యవశిష్టాన్ని భుజించాలి. వేరు చింత లేకుండా భుజించి భోజనమైన పిమ్మట చేతులు, కాళ్ళు కడిక్కొని శాస్త్రరీతిని ఆచమనం కావించి నీటితో అన్ని ఇంద్రియాలు తుడుచుకోవాలి. చౌలము (పంచ శిఖలు పెట్టుట) ఉపనయన సమయంలో జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన, చౌలము విధిగా మంత్రయుక్తంగా చేయాలి. చౌలము వలన అందం, ఆయుష్షు, తేజస్సు అభివృద్ధి అవుతాయి. ఈ చౌలములో పంచ శిఖలు పెడతారు. శాస్త్ర ప్రకారం వటుని ప్రవరలో ఎంత మంది ఋషులు ఉంటారో అన్ని శిఖలు శిరముపై ఉంచి మిగిలిన జుట్టు తీయించాలి. కాని అయిదు శిఖలు ఉంచుట శిష్టాచారంగా ఉంది. వటుని తండ్రి లేక ఉపనయనం చేసె వ్యక్తిని ఆచార్యుడు అంటారు. ఆచార్యుడు మూడు దర్భలను వేడి నీటిలో చన్నీటిని పోసి ఆ నీటిని తూర్పు దిక్కున ఉంచి ఉత్తర దిక్కు వరకు సవ్యంగా వటుని జుట్టును మంత్రయుక్తంగా తడపాలి. తరువాత కత్తిని వటుని శిరమునందుంచి సవ్యంగా నాలుగు దిక్కులనుంచి శిరస్సు మధ్యనుంచి కేశాలు తుంచాలి. ఎద్దు పేడను ప్రమిదగా చేసి దానియందు యవధాన్యమునుంచి ఆ ప్రమిదలో ఐదువైపులా వపనము చేసిన కేశాలనుంచి 'ఉప్త్వాకేశాన్ ' అను మంత్రోచ్చారణతో మేడిచెట్టుయొక్క మూలమందుగాని, దర్భలను స్తంభంగా చేసి దానియందుగాని ఉంచాలి. ఎద్దుపేడ బదులు నేడు వరి పిండితో ప్రమిద చేస్తున్నరు.లోకాచారం ప్రకారం ధాన్యముపై పీటవేసి వటుని కూర్చుండబెట్టి క్షురకునిచే ఆచార్యుడు చేసిన విధంగానే వపనము చేయించి పంచశిఖలు ఉంచాలి. ఆ కత్తిని మూడు రోజులవరకు దేనికీ వాడరాదు. ఉపనయనం వలన ఆశ్రమాధికారం సిద్ధిన్స్తుంది. వేదాధ్యయనము, ధర్మ శాస్త్రాధ్యయనము చేయడానికి ఆయువు, తేజస్సు, యశస్సు, సిరి, పుష్టికామ్యాల అభివృద్ధిని కలగజేసే 24 అక్షరాలుగల గాయత్రి మంత్రోపాసనకు వీలవుతుంది. యజ్ఞోపవీత మంత్రార్ధము: యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాత్| ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః తా|| వేదోక్త కర్మలు చేయు అధికారము పొందుటకు తయారుచేయబడిన, పరమ పవిత్రమయినది, బ్రహ్మ దేవునికి సహజముగా సిద్ధించినదియు, మొదట పుట్టినదియునగు ఈ యజ్ఞోపవీతము నేను ధరించుచున్నాను. యజ్ఞోపవీతము నాకు ఆయుర్వృద్ధి, నిర్మలత్వము, బలమును, పుష్టి, తేజస్సును ఇచ్చుగాక. నందీసమారాధన : శోభన దేవత స్వరూపులైన ఐదుగురు బ్రహ్మచారులను పూజించి పసుపు బట్టలనిచ్చుట ఆచారము. శ్లో|| వటురక్షార లవణం సప్రాణాహుతి ముత్తమమ్| ఏక ఏవమి భుంజీత వ్రతే క్రమ పీడయన్|| తా|| బ్రహ్మచారి కారము, ఉప్పు విడిచి ప్రాణాహుతులతో పాత్రకమైన, ఉత్తమైన ఆహారమును ఈ వ్రతమందు వ్రతభంగము కాకుండా భుజించవలెను. అనగా బ్రహ్మచారి తన బ్రహ్మచర్య దీక్షా వ్రతము పూర్తి అగువరకు ఉప్పు, కారంలేని భోజనం చేయవలెను. శ్లో|| మాత్రసహకుమారం భోజయేత్ తా|| గాయత్రీమంత్ర ప్రోక్షణతో సహా సహపంక్తి లో వటుడు భోజనము చేయవలెను. మాత్రాసహ అంటే తల్లితో కలిసి అని భావించి మధ్వులు ఆవిధంగా ఆచరిస్తున్నారు. కాని మాత్రాసహా అంటే గాయత్రీ మంత్రముతో సహా అని అర్ధము.ఆ సమయమున ఆచార్యుడు గాయత్రీ మంత్రము చెప్పగా వటుడు అన్నముపై ఉదకము ప్రోక్షించును. అమృతో పస్తరణమసి అనుచోట ఉదకము బదులు నేయి వేయవలెను.
అశ్వారోహణము: అగ్నిహోత్రమునకు ఉత్తరపువైపున ఆచార్యుని వలే తూర్పు తిరిగి కూర్చొనవలెను. దక్షిణ దిశగా శానము (సన్నికల్లు లేక రాయి) ఉంచి, ఉపనయనము చేయుచున్న వ్యక్తి (ఆచార్యుడు)"అతిష్టేమ" అను మంత్రమును చెప్పి, సన్నికల్లును త్రొక్కించవలెను. ఈ రాయివలె చాలాకాలము బ్రహ్మచర్య నిష్ఠలో స్థిరుడవై యుండుమని దీని యర్ధము. వస్త్రధారణ: పంచల చాపు ఉత్తరించి ఆచార్యుడు వాటిని అభిమంత్రణచేసి రాతిమీదనే మంత్రయుక్తముగా వటువనకు కట్టవలెను. ఈ వస్త్రములు దేవతలు తయారుచేసినవి. నీవు నిండు నూరేళ్ళు సుఖముగాయుండుటకు ధనము సంపాదించి ఆప్తులకు, అర్ధులకు యివ్వవలెను అని మంత్రార్ధము. మౌంజీ మేఖల ధారణ: ఆచార్యుడు "ఇయందురుక్తా....సుభగామేఖలే